కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళ్ నటుడు శివకుమార్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సూర్య.. కెరీర్ ఆరంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ తర్వాత హీరోగా వెండితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు సూర్య నటించిన చిత్రాలన్ని తెలుగులోకి డబ్ అయి భారీ విజయాన్ని అందుకున్నాయి. వైవిధ్యమైన కంటెంట్ తరహా చిత్రాలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు సూర్య. ఈరోజు ఈ కోలీవుడ్ హీరో బర్త్ డే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సూర్యకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్య కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సూర్య బర్త్ డే సందర్భంగా సూర్య 44 నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సూర్య స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాటిట్యూడ్, మేనరిజం, స్వాగ్, కంటి చూపులతోనే చంపేశారు సూర్య. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రను మించిపోయిన రేంజ్ లో కనచిపించారు. తన గ్యాంగ్ తో కలిసి సూర్య నడిచి వస్తుండగా.. వచ్చిన బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విడుదలైన సూర్య 44 గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా తమ హీరో సినిమాల కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తుండగా.. ఇందులో జోజు జార్జ్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
An unveiling maverick, ready to conquer 🔥 Join the frenzy for #LoveLaughterWar and beyond!
Happy Birthday THE ONE ❤️🔥#HappyBirthdaySuriya #HBDTheOneSuriyaWishes from team #Suriya44@Suriya_Offl @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens… pic.twitter.com/JlxJnJB77E
— 2D Entertainment (@2D_ENTPVTLTD) July 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.