Sudheer Babu: ‘అతను చీడపురుగు అని తెలీదు..’ నిప్పులు చెరిగిన సుధీర్ బాబు

0
42
సిగ్గుగా ఉందంటూ సుధీర్ బాబు ట్వీట్

ప్రణీత్ హనుమంతు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. తండ్రీ కూతుళ్ల రిలేషన్‌కు సంబంధించిన ఓ వీడియోపై.. డార్క్ కామెడీ పేరుతో అసభ్యకర కామెంట్స్ చేశాడు ఈ వ్యక్తి. ఈ తరహా ప్రవర్తనపై తీవ్ర ఆగ్రం వ్యక్తం చేసిన సుప్రీం హీరో సాయి తేజ్ తొలుత ఆ వీడియోను షేర్ చేసి.. పేరెంట్స్ పిల్లల గురించి మరింత కేర్ తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ఆయన పోస్ట్‌పై తెలంగాణ సర్కార్ రియాక్ట్ అయింది. పిల్లల రక్షణ తమ ప్రధాన బాధ్యత అని ఈ ఇష్యూను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఆపై ప్రణీత్‌పై తెలంగాణ పోలీసులు FIR నమోదు చేశారు. ప్రణీత్ ప్రవర్తనపై.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. దీంతో అతను సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియో కారణంగా తన తల్లిదండ్రులు కూడా బాధపడినట్లు వెల్లడించాడు. ఇలాంటి తప్పు మరోసారి జరగదని అన్నాడు. అయితే అతని వ్యాఖ్యలపై దుమారం ఆగలేదు.

అయితే ప్రణీత్ నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. గతంలో అతను సుధీర్ బాబు హీరోగా చేసిన..  హరోం హర సినిమాలో యాక్ట్ చేశాడు. తాజా పరిస్థితులు నేపథ్యంలో సుధీర్ బాబు.. స్పందించాడు. హన్మంతు లాంటి వాడిని తమ సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉందని సంచలన కామెంట్స్ చేశారు. అతను చీడ పురుగు తమకు తెలియదని.. తెలిస్తే సినిమాకు తీసుకునేవాళ్లమే కాదని పేర్కొన్నారు. అతను వాగిన చెత్త గురించి మాట్లాడాలంటే తనకు బాధగా ఉందని సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.  మా అందరినీ క్షమించండి.. ఇలాంటి వాళ్లని వెంటనే శిక్షించాలి అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here