SSMB 29: మహేష్ సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. ఆ ట్రైనింగ్‌లో మూవీ టీమ్

0
30
SSMB 29: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సలార్ నటుడు.. ఆ పాత్ర కోసమేనా..?

ఎస్. ఎస్. రాజమౌళి సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ దర్శకులు కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి గొప్ప చిత్రాలను రూపొందించాడు రాజమౌళి. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్  సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఒకటి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

సీనియర్ నటుడు నాజర్ మహేష్ బాబుకు అలాగే SSMB29 నటీనటులకు డైలాగ్స్ లో నైపుణ్యాలను నేర్పించబోతున్నాడు. డైలాగ్స్ లో నైపుణ్యాలను నేర్పడానికి వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తున్నారట. దీని ద్వారా సినిమాలో నటీనటుల డైలాగ్ డెలివరీ మరింత మెరుగయ్యేలా చేస్తున్నారు జక్కన్న. నాజర్, మహేష్ బాబు కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ‘అతడు’ , ‘పోకిరి’ , ‘దూకుడు’  , ‘ఆగడు’, ‘వన్ నేనొక్కడినే’వంటి చిత్రాల్లో మహేష్, నాజర్ కలిసి నటించారు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఆ రోజున SS రాజమౌళి ఈ చిత్రంలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక ప్రత్యేక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మహేష్ బాబు చివరిగా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో ఆయనతో పాటు శ్రీలీల, రమ్య కృష్ణ, జగపతిబాబు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రూ.150 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.180.5 కోట్ల బిజినెస్ చేసి పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు రాజమౌళి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here