Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedSSMB 29: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సలార్ నటుడు.. ఆ పాత్ర కోసమేనా..?

SSMB 29: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో సలార్ నటుడు.. ఆ పాత్ర కోసమేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఓ మోస్తరు విజయం సాధించడంతో మహేష్ బాబు అభిమానులు నిరాశపడ్డారు. స్టార్ హీరోలంతా బడా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవల్ లో హిట్స్ కొడుతుంటే మహేష్ బాబు మాత్రం లోకల్ గానే సినిమాలు చేస్తున్నారంటూ కాస్త నిరాశ చెందారు. కరెక్ట్ గా అదే టైంలో ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు మహేష్ తో ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ లుక్ మారుస్తున్నారు. ఈ సినిమాలో బీస్ట్ లుక్ లో మహేష్ కనిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమాల్లో విలన్‌లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. విలన్‌లను చాలా పవర్ ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాడు జక్కన్న. ‘ఈగ’ సినిమాలో సుదీప్, ‘బాహుబలి’ సినిమాలో రానా దగ్గుబాటి ఇలా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఆయన సినిమాల్లో విలన్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు రాజమౌళి కొత్త సినిమాకి కూడా ఖడక్ విలన్‌నే ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తుంది. అతను మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఇటీవల విడుదలైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో పృథ్వీరాజ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. పృథ్వీరాజ్ నటనకు చాలా ప్రశంసలు లభించాయి. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలోనూ ఆయన తన నటనతో ఆకట్టుకున్నాడు. పృథ్వీరాజ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ప్రజలు మెచ్చుకున్నారు. ఇప్పుడు రాజమౌళి పృథ్వీరాజ్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఆఫర్‌ని పృథ్వీరాజ్ సంతోషంగా అంగీకరించాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు. సినిమా కథ ఆఫ్రికా అడవుల్లో సాగుతుందని తెలుస్తోంది. ఇందుకోసం సోనీ పిక్చర్స్ లేదా డిస్నీ స్టూడియోస్‌లో భారీ సెట్‌ వేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ డిమాండ్ ఇటీవల పెరిగింది. మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments