Tuesday, November 5, 2024
Google search engine
HomeUncategorizedSrikanth OTT: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ.. ఎందులో...

Srikanth OTT: ఇట్స్ అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించిన సినిమా శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తుషార్ హీరానందానీ తెరకెక్కించిన ఈ బయోపిక్ లో సీనియర్ నటి జ్యోతిక, అలయా ఎఫ్, శరద్ కేల్కర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సుమారు రెండు నెలల క్రితం థియేటర్లలో ( మే10) రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన కలల్ని సాకారం చేసుకున్న శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్ కుమార్ రావ్ నటించాడనే బదులు జీవించాడనే చెప్పుకోవచ్చు. రేటింగ్‌ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. శ్రీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 5) నుంచి ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే శ్రీకాంత్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

భూషణ్‌ కుమార్‌, నిధి పర్మార్‌ సంయుక్తంగా శ్రీకాంత్ నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవిత కథను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో పుట్టి పెరిగిన శ్రీకాంత్ చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయారు. స్కూల్ డేస్ నుంచి అవమానాలను ఎదుర్కొన్న శ్రీకాంత్ అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా చరిత్రకెక్కాడు. తన చదువుకు తగ్గట్టుగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో ఉద్యోగవకాశం వచ్చినా తన సొంత గడ్డపైనే ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2012లో శ్రీకాంత్ పర్యావరణహిత వస్తువులు తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించారు. థియేటర్లలో శ్రీకాంత్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments