Soundarya: చనిపోయిన తర్వాత సౌందర్య ఆస్తి మొత్తం ఏమైంది..? ఆమె సంపాదించిన రూ.100కోట్లు ఏమైపోయాయి..

0
26
చనిపోయిన తర్వాత సౌందర్య ఆస్తి మొత్తం ఏమైంది..?

అలంటి అందాల భామ సౌందర్య భౌతికంగా మనమధ్య లేకున్నా ఆమె ప్రస్తావన ఇండస్ట్రీలో ఎప్పడూ ఉంటూనే ఉంటుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సౌందర్య ప్రేక్షకులకు ఫెవరెట్ హీరోయిన్ గా మారింది. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకుంది సౌందర్య. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసేలా సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించారు సౌందర్య చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో జతకట్టి మెప్పించారు. ఇక వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచియింది. అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు. అంతలా క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెకు బ్రహ్మరధం పట్టారు.

ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా సౌందర్యకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. అప్పట్లో సౌందర్య నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఆమె చేసిన అమ్మోరు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సౌందర్య కాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య. ఇక సౌందర్య ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు బయలుదేరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె కన్నుమూసేనాటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్లు మాత్రమే.. అంత చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించింది సౌందర్య. అయితే చనిపోయే సమయానికి సౌందర్య భారీగానే ఆస్తులు కూడబెట్టింది. ఆమెకు వందకోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అంచన. అయితే ఆ ఆస్తిని సౌందర్య భర్త, ఆమె తల్లి సమానంగా పంచుకున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే చనిపోవడానికి ముందే సౌందర్య వీలునామా రాసిందని కూడా అంటున్నారు. కానీ ఆ వీలునామాను దాచేశారు అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ.. నెట్టింట మాత్రం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here