Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedSonu Sood: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. రియల్ హీరోకు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని.....

Sonu Sood: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. రియల్ హీరోకు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని.. వీడియో

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన పేద విద్యార్థినికి సాయం చేశాడు. దీంతో మరోసారి ‘రియల్ హీరో’ అన్న మాటను ప్రూవ్ చేసుకున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారీ బీఎస్‌సీ చదవాలని కలలు కంది. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితి ఆమె చదువుకు సహకరించడం లేదు. ‘దీంతో నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌’ అని వేడుకుంటోన్న వీడియోను ఒక నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చశాడు. . ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం దేవీ కుమారి చదువుకు కావాల్సిన సాయం చేశారు సోనూ సూద్. దీంతో సదరు విద్యార్థిని ఇంట్లో ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా సోనూ సూద్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసింది దేవీ కుమారి. ‘మా కుటుంబం ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ, నాకు చదువుపై ఎంతో ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మానాన్నలు నా చదువును మధ్యలోనే ఆపేయాలనుకున్నారు. నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధ పడ్డాను. అలాంటి సమయంలో సోనూసూద్‌ సార్ నాకు అండగా నిలిచారు. నా చదువుకు కావాల్సిన సాయం అందజేశారు. ఆయన ఇప్పుడు నాకు దేవుడితో సమానం’ అని హర్షం వ్యక్తం చేసింది దేవీ కుమారి.

ఇదే వీడియోను ట్విట్టర్ లో షేర్‌ చేసిన సోనూ సూద్.. ‘మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్యూ. బాగా చదువుకోండి. కాలేజీ అడ్మిషన్‌ తీసుకున్నాం. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం. ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు సోనూ సద్.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ ఫొటోకు పాలాభిషేకం చేస్తోన్న విద్యార్థిని.. వీడియో

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తల్లిదండ్రులతో దేవీ కుమారి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments