Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedSonu Sood: 'నువ్వు దేవుడివి సామీ'.. భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు...

Sonu Sood: ‘నువ్వు దేవుడివి సామీ’.. భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు సాయం.. వీడియో

ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలు, దినసరి కూలీలకు ఆయన అందించిన సాయం ఎప్పటికీ మరవలేనిది. ఆ తర్వాత కూడా అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడీ రియల్ హీరో. గతంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా గడిపేసే సోనూ సూద్ ఇప్పుడు తన సమయాన్ని మొత్తం ప్రజలకే కేటాయిస్తున్నాడు. సాయం కోరి తన దగ్గరకు వచ్చే వారి కష్టాలు విని ఆపన్నహస్తం అందించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయం కోసం రోజూ వందలాది మంది సోనూ సూద్ ఇంటికి వెళుతున్నారు. ఇదిలా ఉంటూ గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరం కూడా తడిసి ముద్దవుతోంది. దీంతో జనాలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు అడుగుపెట్టడం లేదు. కానీ సోనూసూద్ మాత్రం అలా చేయలేదు. భారీ వర్షంలోనూ సాయం కోసం తన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్లను కలిశారీ రియల్ హీరో.

భోరున వర్షం కురుస్తున్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సోనూసూద్.. తడుస్తూనే ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. తన వంతు సాయం చేస్తానని వారికి మాట ఇచ్చాడు. అలాగే.. ఎవరినీ కాదనకుండా ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగి వారి కళ్లల్లో ఆనందం నింపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజి మాధ్యమాల్లో తెగ వైరలు అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సోనూసూద్ రియల్ హీరో’ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

భారీ వర్షంలోనూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోన్న రియల్ హీరో సోనూసూద్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఫతేహా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించనున్నాడు.

విద్యార్థులతో సోనూసూద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments