Sitara Ghattamaneni: సితారకు మహేష్‌, నమ్రత స్పెషల్‌ విషెస్.. వీడియో వైరల్.

0
17
సితారకు మహేష్‌, నమ్రత స్పెషల్‌ విషెస్.. వీడియో వైరల్.

మహేశ్‌బాబు కుమార్తె సితార పుట్టినరోజు జులై 20 ఘనంగా జరిగింది. ఈసందర్భంగా తన కుమార్తెకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఎక్స్‌ వేదికగా సితార ఫొటో షేర్‌ చేసిన ఆయన ‘హ్యాపీ 12 మై సన్‌షైన్‌’ అని పేర్కొన్నారు. మరోవైపు, నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్‌ చేశారు. ‘‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్‌ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా. ఐ లవ్‌ యూ మై స్వీట్‌హార్ట్‌’’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఈ పోస్టులపై పలువురు నెటిజన్లు స్పందించారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సితార తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ ప్రకటన ద్వారా తాను అందుకున్న పారితోషికాన్ని సేవల కోసం ఉపయోగించారు. తనకు నటి కావాలని ఉందని.. అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పకుండా నటన వైపు వస్తానని ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here