Siddhant Karnick: నన్ను కూడా లైంగికంగా వేధించారు.! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స్.

0
32
నన్ను కూడా లైంగికంగా వేధించారు! క్యాస్టింగ్ కౌచ్ పై హీరో కామెంట్స

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కారణంగా వేధింపులకు గురైన నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే నటీమణులకే కాదు కొందరు నటులకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇటీవలే కొందరు యాక్టర్లు ఈ విషయంపై మాట్లాడేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ‘యానిమల్’ సినిమా నటుడు సిద్ధాంత్ కార్నిక్ కూడా స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. ఇంతకీ ఈయన ఏం చెప్పారంటే.. ! “అది 2005. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. నేను సినిమా ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టాను. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్‌ని కలిశా. అతను నా వివరాలన్నింటినీ తీసుకుని రాత్రి 10.30 గంటలకు ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ఇంట్లోని ఫొటోలు, వాతావరణం చూశాక అది సేఫ్ ప్లేస్ గానే అనిపించింది. కానీ అతను మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు. అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించాను. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్‌ లేదని చెప్పి బయటకొచ్చేశాను. నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. కానీ వాటన్నింటికీ భయపడకుండా బయటకు వచ్చాను” అని చెప్పుకొచ్చాడు సిద్ధాంత్ కార్నిక్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here