Shruti Haasan: రజినీకాంత్ కూతురిగా కమల్ హాసన్ కూతురు.. పొరపాటున చెప్పేసిన హీరోయిన్

0
20
రజినీకాంత్ కూతురిగా కమల్ హాసన్ కూతురు..

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయారు. జైలర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 700కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ లోకేష్ కానగరాజ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కూలీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొన్నామధ్య ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ‘కూలీ’ ఫుల్ యాక్షన్ అండ్ డ్రామాగా ఉండబోతుంది. దీని కథ బంగారం స్మగ్లర్ల చుట్టూ తిరుగుతుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని త్వరలోనే ప్రేక్షకులతో పంచుకుంటామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాగా ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ లో ఆమె డే వన్ కూలీ అని రాసుకొచ్చింది. ఆతర్వాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. దాంతో ఆమె పొరపాటున రివీల్ చేసిందని అర్ధమవుతుంది.

అంతే కాదు కూలీ సినిమాలో శ్రుతిహాసన్ రజినీకాంత్ కూతురిగా కనిపిస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో బిజీగా మారింది. ఇటీవలే ఈ అమ్మడు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. అలాగే అడవి శేష్ తో ఓ సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలోనూ నటిస్తుంది. త్వరలోనే మేకర్స్ దీని పై అప్డేట్ ఇవ్వనున్నారు. లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శ్రుతిహాసన్ ఇన్ స్టా ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here