సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడో ఓ సినిమా హిట్ అయితే దాని తలూకు ఇంపాక్ట్ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇంకో సినిమాపై కనిపిస్తుంది. అలాంటిది సేమ్ డైరక్టర్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్టులు వరుసబెట్టి రిలీజ్‌కి రెడీ అవుతుంటే, ప్రభావం లేకుండా ఉంటుందా చెప్పండి…. కచ్చితంగా ఉంటుంది కదా అంటారా?.. ఇలా అంటారని తెలిసే శంకర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏంటది?
టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే భారతీయుడు సినిమాతో ఇరగదీశారు శంకర్. అలాంటిది ఇప్పుడు ఎక్స్ పీరియన్స్, బడ్జెట్, టెక్నాలజీ.. ఇన్నీ ఉన్నప్పుడు ఇంకే రేంజ్లో బొంబాట్ చేస్తారో అంటూ ఇండియన్2 కోసం ఆత్రుతగా ఎదురుచూశారు జనాలు. అయితే అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. ఇండియన్ 2 మార్నింగ్ షోతోనే బ్యాడ్ టాక్ తెచ్చేసుకుంది.
ఇండియన్ 2 బాలేదట అనే మాట వైరల్ అయ్యీ కాగానే అందరి చూపులూ గేమ్ చేంజర్ వైపు మళ్లాయి. గేమ్ చేంజర్‌ని శంకర్ ఇన్నాళ్లుగా చిత్రీకరిస్తున్నారు… అది ఎలా ఉండబోతోందో… అసలే ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ ఇష్టంగా చేస్తున్న సినిమా… ఎలా షేపప్ అవుతుందో అనే బెంగ మొదలైంది రామ్‌చరణ్ అభిమాన గణంలో.
ఈ విషయం శంకర్ చెవిన కూడా పడ్డట్టుంది. ఇక ఎటూ చూసేది లేదు… లేజర్ పాయింట్ ఫోకస్ మొత్తం గేమ్ చేంజర్ మీదేనని ఫిక్సయ్యారు. ఆల్రెడీ చెర్రీ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. ఓవరాల్‌గా మిగిలిన 20 రోజుల షెడ్యూల్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. గుమ్మడికాయ కొట్టగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకోవాలని ఫిక్సయ్యారట శంకర్.
గేమ్ చేంజర్ హిట్ అయితేనే శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ కి కాస్తయినా నమ్మకం కుదురుతుంది. లేకుంటే గత కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఆయన ఆయన కెరీర్‌ని లంగరేసి లాగినా ఒడ్డుకు తీసుకురావడం కష్టమేనని అంటున్నారు క్రిటిక్స్.