Sekhar Master: మాకు డాన్స్ తప్ప మరొకటి రాదు..!స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్

0
35
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్

స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ మాస్టర్ గా అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ అంటే ప్రభుదేవా, లారెన్స్ తర్వాత గుర్తొచ్చే పేర్లు శేఖర్ మాస్టర్ , జానీ మాస్టరే.. వీరిద్దరూ స్టార్ హీరోలకు డాన్స్ కొప్రియోగ్రాఫ్ చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. శేఖర్ మాస్టర్ మహేష్ బాబు, అల్లు అర్జున్ , చిరంజీవి లాంటి స్టార్స్ కు చాలా హుక్ స్టెప్స్ చేసి ఫెమస్ అయ్యారు. ఓ వైపు డాన్స్ మాస్టర్ గా బిజీగా గడుపుతూనే మరో వైపు పలు టీవీ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న ఢీ అనే డాన్స్ షోకు కూడా శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షో అనే ప్రోగ్రాం విజయాంతంగా పూర్తయ్యింది. ఇక ఇప్పుడు ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 డ్యాన్స్ షో మొదలైంది. ఈ షోకి శేఖర్ మాస్టర్ , క్రేజీ హీరోయిన్ హన్సిక, మరో డాన్స్ మాస్టర్ గణేష్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2  నుంచి ఓ ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు పూయించాడు. ఆతర్వాత ఒకొక్కరు ఒకొక్క థీమ్ తో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ఆగిపోయాడు.  కారణం అడిగితే పక్కన డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ ఎదో చెప్పాడు. దాంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. డాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో ఆయన తన కన్నీళ్లతో చెప్పారు.మేము  మేము డాన్సర్స్ కదా మాకు డాన్స్ తప్ప మరొకటి రాదు. డాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా.? మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ పని పోతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఫైనల్ టాస్క్ లో డ్యాన్సర్లు అదరూ అరిస్తే.. అంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చేస్తున్న వృత్తి పై శేఖర్ మాస్టర్ కు ఎంత గౌరవం , ప్రేమ ఉన్నాయో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here