సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో తెరకెక్కిన సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది.. అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం..!
‘సారంగ దరియా’ ట్రైలర్ చూస్తే.. క్లాసు రూముల్లో పిల్లలకు పాఠాలు బోధించే ఓ ఉపాధ్యాయుడి భావోద్వేగం, కులాంతర ప్రేమ వంటి అంశాలు కనిపిస్తాయి. కానీ, కథలో అంతకు మించి సున్నితమైన అంశాన్ని చిత్ర దర్శకుడు పండు అలియాస్ పద్మారావు అబ్బిశెట్టి టచ్ చేశారు. ట్రాన్స్‌జెండర్స్.. సమాజంలో భాగమే. అయితే.. కొంత మంది వాళ్ళని కాస్త చిన్న చూపు చూస్తారు. సినిమాల్లోనూ వాళ్ళను గొప్పగా చూపించిన సందర్భాలు తక్కువ. అయితే.. ‘సారంగ దరియా’లో ట్రాన్స్‌జెండర్స్ గురించి ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయనటువంటి అంశాన్ని చూపించారు డైరెక్టర్. ఆ సన్నివేశాలు అన్నీ చాలా భావోద్వేగ భరితంగా ఉంటాయి. ప్రేక్షకులు కంటతడి పెట్టడం పక్కా.!
ఇక ‘సారంగ దరియా’ ఫస్టాఫ్ కాస్త నిదానంగానే సాగుతుంది. పాత్రల పరిచయం, అలాగే ప్రేమ వినోదాత్మక సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రేక్షకులు షాక్ ఇవ్వడం ఖాయం. ట్రాన్స్‌జెండర్ రోల్ ఎవరు చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. ఇక… ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువ అవుతాయి.. క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ మిగులుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.