రోజులు గడిచేకొద్దీ చాలా విషయాలు అర్థమవుతుంటాయి. వాటిలో కొన్నిటిని గుట్టుగా మనసులోనే ఉంచుకోవాలనిపిస్తుంది. మరికొన్నిటిని మాత్రం అనుభవాలుగా మార్చి, పక్కవారికి చెప్పుకోవాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న కొందరికి ఇలాంటి విషయాలనే చెప్పాలని ఫిక్స్ అయ్యారు సారా అలీ ఖాన్… ఇంతకీ ఆమె ఏం చెప్ప దలచుకున్నారని అంటారా? మీరూ వినేయండి…
సారా అలీ ఖాన్ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. జీవితంలో సక్సెస్ ఉన్నన్ని రోజులూ వేరుగా ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అని అంటున్నారు సారా.
తన కెరీర్లో మూడో సినిమా లవ్ ఆజ్కల్ ఆశించినంత విజయం సాధించలేదు. సారా కెరీర్లో తొలి రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. మూడో సినిమా లవ్ ఆజ్కల్ ఫ్లాప్ కావడానికి తానే ఓ కారణం అని అంటున్నారు సారా.
తనకు ఆ పాత్రను చేయాలని అనిపించలేదట. అయినా ఎవరో చెప్పారని, ఒత్తిడి చేశారని ఓకే అన్నారట. అక్కడే తప్పు చేశానని అంటున్నారు సారా. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే, మనసుకు నచ్చిందే చేయాలని సలహా ఇస్తున్నారు సారా.
మన పనులు ఇతరులకు నచ్చనప్పుడు అందరూ మనల్నే వేలెత్తి చూపిస్తారని అన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలని అంటున్నారు సారా అలీ ఖాన్.