Santhosham Movie: అయ్యా బాబోయ్.. నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్‏ను చూశారా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

0
25
నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్‏ను చూశారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుని.. ఆ తర్వాత కనిపించకుండాపోయారు. ఒకటి రెండు చిత్రాల్లో మెరిసి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అందులో గ్రేసీ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ నాగార్జున నటించిన సంతోషం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీ పేరు చెప్పగానే అందం, అమాయకత్వం కలిసిన ఓ రూపం అడియన్స్ కళ్లముందుకు వస్తుంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సంతోషం ఒకటి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రియా శరణ్, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా నటించగా.. ప్రభుదేవా, విశ్వనాథ్, పృథ్వీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది.

వీరిద్దరి కాంబోలో వచ్చిన “దేవుడే దిగివచ్చినా.. తాజ్ మహల్ నాకిచ్చానా..” అనే పాట చాలా ఫేమస్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ తర్వాత తెలుగులో ఆ బ్యూటీకి ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా.. కానీ అలా కాలేదు. సంతోషం సినిమా తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి నటించిన తప్పుచేసి పప్పు కూడు సినిమాలో నటించింది. ఇక తర్వాత మరో మూవీ చేయలేదు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిలం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో మెరిసిన గ్రేసీ సింగ్..ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

ఇక హిందీలో అమీర్ ఖాన్ సరసన గ్రేసీ సింగ్ నటించిన లగాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో గ్రేసీ నటనకు నార్త్ అడియన్స్ ముగ్దులయ్యారు. ఆ తర్వాత గంగాజల్, మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించింది. చివరిసారిగా 2015లో ఓ పంజాబీ సినిమాలో కనిపించింది. గ్రేసీ సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన గ్రేసీ సింగ్.. తన పేరిట గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్ ప్రారంభించి దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు చేస్తుంది. అలాగే బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరచూ సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆమె తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేయగా.. గ్రేసీ సింగ్ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్యర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here