Samantha Controversy: సమంత హెల్త్‌ టిప్స్‌పైరచ్చ రంబోలా.! ఇంకా చల్లారని కాంట్రవర్సీ..

0
25
సమంత హెల్త్‌ టిప్స్‌పై రచ్చ రంబోలా.! ఇంకా చల్లారని కాంట్రవర్సీ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఇంటా బయటా కాక రేపుతోంది. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన హెల్త్‌ టిప్స్‌ ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. హైడ్రోజన్ పైరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సామ్ సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు. అంతేకాదు సమంతను నిరక్షరాస్యులిగా అభివర్ణించారు. దీనికి ఆమె కౌంటర్‌ కూడా ఇచ్చారు.

ఇక ఈ సమస్యకు ఎండ్ పడినట్లే కనిపించినా.. తాజాగా సమంత షేర్ చేసిన చిట్కా విషయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇతరులకు సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదేనని కానీ, జరగరానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా ? అంటూ గుత్తాజ్వాల ఫైర్ అయ్యారు. సమంత పేరు ప్రస్తావించకుండానే గుత్తా జ్వాల ఈ కామెంట్స్ చేశారు. జనాలకు ఆరోగ్య సూచనలు ఇచ్చే సెలబ్రిటీలను ఒకే ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మీరు సూచించిన చికిత్స వల్ల అవతలి వాళ్లు మరణిస్తే పరిస్థితి ఏంటని ట్విట్టర్‌ వేదికగా గుత్తాజ్వాల ప్రశ్నించారు.

తాజాగా మరో నటి పూనమ్‌కౌర్‌ కూడా సమంత హెల్గ్‌ టిప్స్‌పై స్పందించారు. గుత్తాజ్వాల ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆమె..ఇది సెల్ఫ్‌ గ్లోరిఫికేషన్‌ జ్వాలా..దేన్ని అయినా అడ్వర్టైజ్‌ చేయొచ్చు అనే దానికి ఉదాహరణ అన్నారు. చాలామంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు..కానీ వాళ్లు మాత్రం చక్కెర ఉన్నటువంటి పదార్థాలైన చాక్లెట్లు , కూల్‌ డ్రింక్స్‌ విచ్చలవిడిగా ప్రమోట్‌ చేస్తూ ఉంటారన్నారు. ఇదంతా కేవలం డార్క్‌ రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనమ్ కామెంట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here