Saturday, December 28, 2024
Google search engine
HomeUncategorizedSamantha: సమంతకు క్షమాపణలు.. కానీ ఆమె చెప్పిన వ్యక్తి డాక్టర్ కాదు.. అసలు విషయం చెప్పిన...

Samantha: సమంతకు క్షమాపణలు.. కానీ ఆమె చెప్పిన వ్యక్తి డాక్టర్ కాదు.. అసలు విషయం చెప్పిన డాక్టర్..

గత కొంతకాలంగా తన ఇన్ స్టా వేదికగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు.. డాక్టర్ల సూచనలు అభిమానులతో పంచుకుంటుంది హీరోయిన్ సమంత. కానీ ఇటీవలే ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. దీంత సమంత ఇచ్చిన హెల్త్ టిప్ పై డాక్టర్స్ మండిపడుతున్నారు. ఆమె చెప్పినట్లు చేస్తే మనుషుల ప్రాణాలు పోతాయని.. ప్రజలకు ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ డాక్టర్ లివర్ డాక్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి మాటలకు గట్టిగానే కౌంటరిచ్చింది సామ్. తనను విమర్శించడానికి ముందు తాను ట్యాగ్ చేసిన వైద్యుడితో చర్చ జరిపి ఉండాల్సిందని.. తాను డబ్బుల కోసం కాకుండా, తను అనుసరించిన విధానాలను.. డాక్టర్స్ చెప్పిన సలహాలను మాత్రం నెటిజన్లతో పంచుకుంటున్నానని తెలిపింది. సమంత, లివర్ డాక్ మధ్య నెట్టింట మాటల యుద్ధం జరిగింది. దీంతో సమంతకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. డాక్టర్ లివర్ డాక్ తీరును తప్పుపట్టారు. దీంతో సమంతను విమర్శించినందుకు డాక్టర్ లివర్ డాక్ ఆమెకు క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా సుధీర్ఘ పోస్ట్ చేశారు.

“సమంత ఆరోగ్య పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఆమె చెప్పిన హెల్త్ టిప్ మాత్రం సరైనది కాదు. ఆ విషయాన్ని ఖండించిన తీరుకు ఆమె బాధపడ్డారు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇది అనుకోకుండా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. కానీ ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ ది తప్పు. తన సొంత లాభం కోసం సమంత వంటి సెలబ్రెటీల ద్వారా హనికరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అది మాత్రమే నేను ఖండిస్తున్నాను.

సమంతకు హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవాలని సలహా ఇచ్చిన వ్యక్తి అసలు డాక్టర్ కాదు. అతడు ఒక ప్రకృతి వైద్యుడు. ప్రకృతి వైద్యులు ఎప్పుడూ సమాజానికి, రోగులకు , ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన సలహాలు ఇస్తుంటారు. అతడిని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చాలాసార్లు హెచ్చరించింది. అతను ఒక మోసగాడు” అంటూ సుధీర్ఘ నోట్ షేర్ చేశాడు డాక్టర్ లివర్ డాక్. ప్రస్తుతం అతడు చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments