Samantha: తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!

0
32
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!

సోషల్ మీడియాలో మరో సారి సమంత హాట్ టాపిక్ అవుతోంది. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి తాజాగా తన పాడ్‌క్యాస్ట్‌లో ప్రస్తావించడంతో.. ఓ చిన్న పాటి డిబెట్‌ను ఆమె షురూ చేసినట్టు అయింది. సమంత చెప్పిన హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ ప్రక్రియ చాలా డేంజర్‌ అని.. అది ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని కొందరు డాక్టర్లు సమంతపై నేరుగా విమర్శలు చేసే వరకు వచ్చింది. అయితే అందులో డాక్టర్‌ అభయ్ ఫిలిప్‌ .. తనపై చేసిన విమర్శలు కాస్త అతిగా.. అభ్యంతరకరంగా అనిపించడంతో.. ఈ కామెంట్స్‌ పై తాజాగా రియాక్టయ్యారు సమంత. రియాక్టవ్వడమే కాదు.. చాలా కూల్‌గా ఈ డాక్టర్‌కు కౌంటర్‌ ఇచ్చేశారు. ఒక పెద్దమనిషి తన పోస్ట్‌ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్‌ను ఉద్దేశించి సమంత రాసుకొచ్చారు.

ఆయన కూడా డాక్టరే.. తన కంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు.. కానీ.. తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికారు. అంతేకాదు.. తనను జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధలేదని.. పదజాలం కరెక్ట్‌గా ఉంటే గౌరవించేదానిని అన్నారు సమంత. అయితే.. ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా ఆ డాక్టర్ తనను నిందించారని.. అనుకున్నా అన్నారు సమంత. కానీ.. తాను ఒక సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ చెప్పలేదని… ఒక సామాన్య వ్యక్తిగానే ఆ పోస్ట్‌ను తన ఇన్టస్టాలో పోస్ట్ చేశానని చెప్పారు. మొత్తంగా.. ఇన్‌స్టాలో ఒక పోస్టు.. డాక్టర్‌ రిప్లై.. సమంత కౌంటర్‌తో.. సోషల్‌ మీడియాలో ఆమె మరోసారి హాట్‌టాపిక్‌ అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here