కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్‌దే అయినా ఇప్పుడు వాడుకుంటున్నది మాత్రం సమంత. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న స్యామ్.. ఏకంగా మెగాస్టార్ సినిమాతోనే కమ్ బ్యాక్ ఇస్తున్నారు. పైగా తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికే లైఫ్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ ఏంటా కాంబినేషన్..?
ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. కనీసం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు. ఒప్పుకున్న వరకు పూర్తి చేసి.. హెల్త్‌పై ఫోకస్ చేసారు ఈ బ్యూటీ. పైగా ఈ మధ్యే సద్గురు ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో కనిపించారు.
ఈమె తీరు చూసాక.. ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు కానీ అంతలోనే కొత్త సినిమాకు ఓకే చెప్పారు స్యామ్. కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు.. బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్‌లో నటిస్తున్నారు.
అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం సౌత్ సినిమా ఓకే చేసారు సమంత. ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాల తర్వాత గౌతమ్ మీనన్‌తో సినిమా చేస్తున్నారు స్యామ్.
మమ్ముట్టి హీరోగా గౌతమ్ మీనన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. సమంత, మమ్ముట్టి జాయిన్ కానున్నారు. ఈ సినిమాతోనే మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఎవరి కోసం ఈ సినిమా సైన్ చేసినా.. సమంత మళ్లీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తుండటంతో ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.