భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. టైగర్ సిరీస్ మీద ఉన్న నమ్మకం, పఠాన్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఈ సినిమాను ఫెయిల్యూర్ నుంచి కాపాడలేకపోయాయి.
అందుకే నెక్ట్స్ తన తర్వాతి మూవీ విషయంలో డైలామాలో పడ్డారు భాయ్‌జాన్. సౌత్ దర్శకుడుతో ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓకే చెప్పిన సినిమాలను కూడా పక్కన పెట్టి, కొత్త ప్లాన్ రెడీ చేశారు.
చాలా రోజులు ఆలోచించి ఫైనల్‌గా మురుగదాస్ డైరెక్షన్లో సికందర్ మూవీకి ఓకే చెప్పారు సల్మాన్. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు సికందర్ తరువాత చేయబోయే సినిమా కూడా సౌత్ డైరెక్టర్‌తోనే ప్లాన్ చేస్తున్నారు.
టైగర్ 3 సెట్స్ మీద ఉండగానే ది బుల్ అనే సినిమా గురించి డిస్కషన్ మొదలైంది. జవాన్ సక్సెస్ తరువాత దర్శకుడు అట్లీ ది బుల్ మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశారు. సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే అన్నా… వెంటనే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు జవాన్ డైరెక్టర్‌తో మరో మూవీని లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నారు భాయ్‌జాన్.
సికందర్ సెట్స్ మీద ఉండగానే ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయాలన్నది సల్మాన్ ప్లాన్. ఈ రెండు సినిమాలను షార్ట్ గ్యాప్‌లోనే రిలీజ్ చేస్తే ఏదో ఒక సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి రావొచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.