న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాలో మలార్ గా అందరి మనసులు దోచుకున్న ఈ బ్యూటీ.. తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవికి తండేల్ టీమ్ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతోకేక్ కట్ చేయించి తినిపించారు. అంతేకాదు సెట్ లోని వారంతా ఆరు సింబల్స్ చూపిస్తూ సాయి పల్లవికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు.
ఇంతకీ ఈ సెలబ్రేషన్స్ కు కారణమేంటో తెలుసా? సాయి పల్లవి రీసెంట్ గా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఎస్ ! ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి హవా కొనసాగింది. గార్గి, విరాటపర్వం చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుందీ అందాల తార. వీటితో కలిపి సాయిపల్లవి ఇప్పటివరకు అందుకున్న ఫిలింఫేర్ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా న్యాచురల్ బ్యూటీ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్ కటింగ్‌తో సెలబ్రేట్ చేసింది తండేల్ టీమ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.