న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాలో మలార్ గా అందరి మనసులు దోచుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఫిదా, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. వీరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవికి తండేల్ టీమ్ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతోకేక్ కట్ చేయించి తినిపించారు. అంతేకాదు సెట్ లోని వారంతా ఆరు సింబల్స్ చూపిస్తూ సాయి పల్లవికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. ఇంతకీఈ సెలబ్రేషన్స్ కు కారణమేంటో తెలుసా? సాయి పల్లవి రీసెంట్ గా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. అలా తన కెరీర్ లో ఇప్పటివరకు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెల్చుకుందీ న్యాచురల్ బ్యూటీ. అందులో భాగంగానే తండేల్ టీమ్ ఆమెను ఘనంగా సన్మానించింది.
సాయి పల్లవి తన మొదటి సినిమా ప్రేమమ్ కు బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ సౌత్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలకు గానూ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. ఇక ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల జాబితాలోనూ సాయిపల్లవి హవా కొనసాగింది. గార్గి, విరాటపర్వం (క్రిటిక్స్ విభాగంలో) చిత్రాలకుగానూ మరో రెండు అవార్డులు అందుకుందీ అందాల తార. వీటితో కలిపి సాయిపల్లవి ఇప్పటివరకు అందుకున్న ఫిలింఫేర్ పురస్కారాల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఆరు ఫిలింఫేర్లు అందుకున్న ఏకైక నటిగా న్యాచురల్ బ్యూటీ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే తన విజయాన్ని చిత్రబృందం కేక్ కటింగ్‌తో సెలబ్రేట్ చేసింది తండేల్ టీమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు సాయి పల్లవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
తండేల్ సెట్ లో సెలబ్రేషన్స్..
Team #Thandel celebrated the twin wins of @Sai_Pallavi92 at the Filmfare Awards on the sets of the film ❤️🔥
‘Satya’ from #Thandel will be another memorable role from the talented actor ✨#Dhullakotteyala 💥💥
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/4qdrMUtaqH
— Geetha Arts (@GeethaArts) July 17, 2024
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..