Sai Pallavi: పదేళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నా.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చిన సాయి పల్లవి

0
22
పదేళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నా..

టాలీవుడ్ లో నేచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి. చాలా మంది కుర్రాళ్ళు ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని అనుకునే క్వాలిటీస్ అన్ని ఈ అమ్మడిలో మెండుగా ఉన్నాయి. అంతలా ప్రేక్షకులకు దగ్గరైయ్యింది ఈ ముద్దుగుమ్మ. చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తన నటనతో ఏంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన  ఫిదా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ కుర్రది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా వరుస సినిమాలతో బిజీగా అయ్యింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి.

ఇక పోతే ఇటీవలే సాయి పల్లవి సిస్టర్ పూజ పెళ్లి జరిగింది. పూజ పెళ్లి వేడుకలో సాయి పల్లవి డాన్స్ లతో సందడి చేసింది. సాయి పల్లవి, పూజా పెళ్ళిలో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందని అభిమానుల మధ్య చర్చ మొదలైంది. తాజాగా సాయి పల్లవి 10 ఏళ్లుగా ఒకరితో రిలేషన్ లో ఉన్నా అని చెప్పి షాక్ ఇచ్చింది.

అవును సాయి పల్లవి ఒకరితో రిలేషన్ లో ఉందట.ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. మహాభారతంలో అర్జునిడి కుమారుడైన అభిమన్యుడి గురించి ఆమె చాలా విషయాలు చదివి తెలుసుకుందట. గడిచిన 10 ఏళ్లుగా అభిమన్యుడు క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకున్నానని, అతనితో 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నా అని తెలిపింది సాయి పల్లవి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక సాయి పల్లవి బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here