Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedSai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి...

Sai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమట..

లేడీ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల చేత పిలుపించుకుంటున్న సాయి పల్లవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మొన్నీమధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసింది. ప్రస్తుతం అక్కినేని అందగాడు నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేస్తుంది. తండేల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టనుంది సాయి పల్లవి. అక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో సీతమ్మ పాత్రలో కనిపించనుంది ఈ నేచురల్ బ్యూటీ. ఇటీవలే ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోల్లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించగా సీతగా సాయి పల్లవి చూడముచ్చటగా కనిపించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇదిలా ఉంటే సాయి పల్లవికి ఓ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఆ హీరో అంటే సాయి పల్లవికి ఎంతో అభిమానం అంట.. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్నీ సాయి పల్లవి స్వయంగా చెప్పింది.. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. సాయి పల్లవికి మెగాస్టార్ చిరంజీవి అంటే చాల ఇష్టం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. దాంతో కొంతమంది షాక్ అవుతున్నారు. ఈ జనరేషన్ అమ్మాయి అయ్యుండి.. ఏ అల్లు అర్జున్ పేరో లేక పవన్ కళ్యాణ్ పేరో.. లేదా ప్రభాస్ పేరో చెప్తుంది అనుకుంటే ఏకంగా బాస్ పేరు చెప్పింది. దట్ ఈజ్ సాయి పల్లవి అని అంటున్నారు

ఇది కూడా చదవండి :Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే

అయితే సాయి పల్లవికి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చిన కూడా ఆ ఛాన్స్ ను వదులుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవిని సంప్రదించారు. కానీ చిరంజీవి అంత గొప్ప నటుడితో నటించలేను అని చెప్పిందట. తాను అంతగా అభిమానించే హీరోతో నటించడం చాలా కష్టం అని చెపింది సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది. తమిళ్ , తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మరి సాయి పల్లవి అక్కడ ఎంతగా సక్సెస్ అవుతుందో చూడాలి.

Chiranjeevi

Chiranjeevi

సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ ..

సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments