Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedSai Pallavi : చేతులారా ఆ స్టార్ హీరో సినిమాను మిస్ చేసుకున్న సాయి పల్లవి..!...

Sai Pallavi : చేతులారా ఆ స్టార్ హీరో సినిమాను మిస్ చేసుకున్న సాయి పల్లవి..! ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి .. వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.. ఇటీవలే బాలీవుడ్ నుంచి ఓ బడా సినిమాను కూడా అందుకుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతుంది. స్టార్ హీరోయిన్స్, సీరియర్ హీరోయిన్స్ కూడా సొంతం చేసుకోలేని క్రేజ్ ఈ అమ్మడికి ఉంది. తెలుగులో ఈ బ్యూటీ లేడీ పవర్ స్టార్ అని ఫ్యాన్స్ చేత పిలిపించుకుంది.. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంటే.. సాయి పల్లవి మాత్రం ఆ దారిలో వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంటెంట్ ఉన్న సినిమాలు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అలరిస్తుంది. ఇటీవలే సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ బాన్సువాడ భానుమతి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసింది.

ఇదిలా ఉంటే సాయి పల్లవి ఓ స్టార్ హీరో సినిమా మిస్ అయ్యిందట. టాలీవుడ్ స్టార్ హీరోకు జోడిగా సాయి పల్లవి నటించే అవకాశం వచ్చినా.. ఆ ఛాన్స్ ఆమె వల్లే మిస్ అయ్యిందట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును సాయి పల్లవి, అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రావాలి అయితే సాయి పల్లవి కారణంగానే ఈ కాంబో సెట్ అవ్వలేదని అని తెలుస్తోంది. ఆ సినిమా ఎదో కాదు పాన్ ఇండియా మూవీ పుష్ప.

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతంచేసుకుంది. అయితే ఈ సినిమాలో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట సుకుమార్. డీ గ్లామర్ పాత్ర పైగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సాయి పల్లవి ఆయితే  చక్కగా సెట్ అవుతుందని అనుకున్నారట సుకుమార్. అయితే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఎక్స్ పోజింగ్ చేయాల్సి ఉండటంతో సాయి పల్లవి ఆ పాత్రను వదులుకుందట. దాంతో ఆ ఛాన్స్ రష్మికా అందుకుందట. సాయి పల్లవి ఈ సినిమా చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుత నాగ చైతన్య తో కలిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సాయి పల్లవి ఇన్ స్టా..

అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments