Rhea Chakraborty: సినిమాలు లేవుగా సంపాదన ఎలా ?.. నేను చేతబడి చేశానన్నారు.. టాలీవుడ్ హీరోయిన్..

0
22
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..

సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ ఈ పేరు చెప్పగానే ఎంతో మంది కళ్లు చెమ్మగిల్లకమానవు. ఈ హీరో మరణం గుర్తుకురగానే కోట్లాది మంది అడియన్స్ హృదయాలు బరువెక్కుతాయి. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో.. కానీ అంతలోనే సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. కానీ బీటౌన్ స్టార్స్ నెపోటిజమే సుశాంత్ ను చంపేసిందని.. అతడిది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ కుటుంబసభ్యులు, అభిమానులు ఆరోపణలు చేశారు. అధికారులు మాత్రం ఈ హీరో సూసైడ్ చేసుకున్నారని చెప్పగా.. ముమ్మాటికి హత్యే అంటూ వాదించారు. ఇప్పటికీ సుశాంత్ మరణం పై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఈ హీరో మృతి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు చిత్రాలను బ్యాన్ చేశారు. ముఖ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

రియా చక్రవర్తి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈకేసులో ఆమె కొన్నాళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఈఘటనతో రియా సినిమాలకు దూరమైంది. ఆమె బయట ఎక్కడ కనిపించినా లెక్కలేనన్ని మాటలు అన్నారు. ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న రియా.. తాజాగా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమాలు లేకపోవడంతో తన సంపాదన గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారని.. కొందరు ఆమె చేతబడి చేస్తుందని అన్నారని చెప్పుకొచ్చింది.

“ఇప్పుడు నేనేం చేస్తున్నాను.. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నేను సినిమాలు చేయడం లేదు. కానీ మోటివేషనల్ స్పీకర్ గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో చాప్టర్. గతంలో ఏం జరిగిందో.. ఎంత బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకుని నా గురించి అన్ని తెలిసినట్లు విమర్శలు చేస్తున్నారు. కొందరు నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయితీగా ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here