డ్రగ్స్ ముచ్చట వినరావొద్దు.. ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలంటూ సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కేవలం సినిమా టికెట్ల ధర పెంపు కోసమో.. లేదా షూటింగుల అనుమతుల కోసం సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దని .. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త సినిమాల విడుదలకు ముందు సినిమాలో ఉన్న తారలతో డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు తయారుచేయాలన్నారు. అలా చేస్తేనే ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టంచేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Disha Patani: దిశా చేతిపై ప్రభాస్ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్
ఈ హీరోయిన్ వాచ్ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే
అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్