Tuesday, January 7, 2025
Google search engine
HomeUncategorizedRenu Desai : దారుణంగా మాట్లాడుతున్నారు.. ఆ నీచుల్ని జైల్లో వేసి చితక్కొట్టాలి.. రేణు దేశాయ్...

Renu Desai : దారుణంగా మాట్లాడుతున్నారు.. ఆ నీచుల్ని జైల్లో వేసి చితక్కొట్టాలి.. రేణు దేశాయ్ ఆగ్రహం

సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై ఓ రెవల్యూషన్ మొదలైంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్.. లేకి వీడియోలు షేర్ చేస్తూ శునకానందం పొందుతున్నారు. ఎవరో ఒకరు చైల్డ్ అబ్యూజ్ వీడియో చేయడం దానికి కొంతమంది మితిమీరి కామెంట్స్ చేయడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ చైల్డ్ అబ్యూజ్ వీడియో, ఫోటోల పై జాగ్రతగా ఉండాలంటూ ఓ మెసేజ్ షేర్ చేశారు. తండ్రి కూతుళ్ల రిలేషన్ మీద కూడా అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ కొంత మంది ఆకతాయిలు ముచ్చట్లు పెట్టుకున్నారు. దీని పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. తండ్రి కూతుర్ల ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో జంతువులు ఉన్నాయి. సోషల్ మీడియా అనేది క్రూరంగా తయారైంది. చెత్త కామెంట్స్ చేసే వారు ఎక్కువయ్యారు.. ఆ కామెంట్స్ మీరు చూసి తట్టుకోలేరు. దయ చేసి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చాడు తేజ్.

ఇది కూడా చదవండి : అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్.. ఒకొక్క యవ్వారం బయటపెడుతున్న లావణ్య

అలాగే ఇలాంటి పిచ్చి చేష్టలు చేసేవారిని శిక్షించాలి అని తెలంగాణ ముఖ్యమంతిని కోరాడు తేజ్. దీని పై రేవంత్ కూడా స్పందించారు. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం అని కూడా తెలిపారు సీఎం. విషయం ఏంటంటే.. పి హనుమంత్ అనే ఛానెల్ లో కొంతమంది వీడియోలు చేస్తుంటారు. ఈ వీడియోల్లో తాజాగా ఓ తండ్రి కూతురి మీద జోక్స్ చేస్తూ చెత్త వాగుడు వాగారు. దానికో ఇంకొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. దీని పై ఇప్పుడు అందరూ సీరియస్ అవుతున్నారు. ఇక చైల్డ్ అబ్యూజ్ వీడియోలపై సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నారు. మంచు మనోజ్ వాళ్ళను వదిలిపెట్టను అని సీరియస్ అయ్యారు. అడవి శేష్, విశ్వక్ సేన్ ఇలా అందరూ స్పందిస్తున్నారు. తాజాగా నటి రేణుదేశాయ్ కూడా ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Jabardasth Faima: పెళ్లి ఎప్పుడో చెప్పేసిన జబర్దస్త్ ఫైమా.. ప్రియుడి ఇంటిపేరు ఇదే

సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ నీచులు మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు.. వేరే వాళ్లు షేర్ చేసుకున్న వీడియోల పై ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నారు.. ఇలాంటి నీచులను పోలీసులు అరెస్ట్ చేయాలి.. జైల్లో వేసి వాళ్ళను చితక్కొట్టాలి.. వీళ్లని మాత్రమే కాదు .. ఇలాంటివారికి సపోర్ట్ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయాలి అని మండిపడ్డారు రేణు దేశాయ్.

ఇవి కూడా చదవండి

Renu Desai

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments