రెమ్యునరేషన్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు.. ప్రభాస్. ఈయన సినిమాలు 1000 కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నాయి. బాహుబలి 2 తర్వాత కల్కితో మరోసారి ఈ ఫీట్ అందుకున్నారు రెబల్ స్టార్. నిన్నమొన్నటి వరకు ఓ సినిమాకు 150 కోట్లు తీసుకున్న ప్రభాస్.. కల్కి తర్వాత 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన స్థాయికి అది తక్కువే అంటున్నారు నిర్మాతలు.ప్రభాస్ సినిమాలకు డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో అంటూ నాన్ థియెట్రికల్ బిజినెస్సే దాదాపు 400 కోట్ల వరకు జరుగుతుందిప్పుడు. ఇక థియెట్రికల్ బిజినెస్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంది. అందుకే ఆయనకు 200 కోట్లు ఇవ్వడానికి కూడా సై అంటున్నారు నిర్మాతలు.