మాస్ మాహారాజా రవితేజకు ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన యాక్టింగ్, మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీకి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇక రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరికొన్న సినిమాలు కమర్షియల్ హిట్ కాలేకపోయినా.. అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. రవితేజ చిత్రాలు ఏళ్లు గడిచినా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు తలచుకోగానే ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు తెప్పిస్తాయి. అందులో వెంకీ సినిమా ఒకటి. ఇందులోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఆ ఎపిసోడ్ కు సంబంధించిన మీమ్స్ హంగామా అంతా ఇంతా కాదు.. ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.
నాగార్జున సాగర్‌కు వెళ్లి అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేసే అలవాటు తనకు వెంకీ సినిమాతోనే మొదలైందని అన్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల. అలాగే ఈ సినిమా కోసం ముందుగా హీరోయిన్ గా ఆసిన్ ను అనుకున్నామని.. కానీ కుదరలేదన్నారు. ట్రైన్ సీన్స్ లో ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. ఈ సినిమాకు ముందుగా ట్రైన్ సీక్వెన్స్ వర్కౌట్ కాదేమోనని అందరూ సందేహించారని.. కానీ చివరకు ఆ సన్నివేశాలకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. వెంకీ సినిమా బాగుందని చిరంజీవి సర్ చెప్పడమే ఈ సినిమా విషయంలో తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అని.. వెంకీ 2 తెరకెక్కించే ఆలోచన కూడా వచ్చిందని గతంలో చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన వెంకీ సినిమాలో హీరోయిన్ గా స్నేహా నటించింది. ఇందులో శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, రామచంద్ర, బ్రహ్మానందం, ఏవీఎస్ కీలకపాత్రలు పోషించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.