Rashmika Mandanna: డబ్బులు నిండిన బ్యాగ్‏తో రష్మిక.. క్యూరియాసిటి కలిగిస్తోన్న లేటేస్ట్ వీడియో.. 

0
30
కుబేర నుంచి రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. హిందీ, తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నెట్టింట రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. అందులో అర్దరాత్రి రష్మిక భూమిలో తవ్వకాలు చేపట్టింది. అక్కడే డబ్బులతో నిండిన బ్యాగ్ తీసుకుని తెగ సంబరపడిపోయింది. ఆ తర్వాత డబ్బుల బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. నెటిజన్లకు క్యూరియాసిటీ కలిగిస్తోన్న ఈ వీడియోను కుబేర చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లేటేస్ట్ సినిమా కుబేర. ఇందులో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి అర్దరాత్రి వెళ్లిన రష్మిక.. అక్కడే గుంతలో పుడ్చిన బ్యాగ్ బయటకు తీసింది.

ఆ బ్యాగ్ మొత్తం డబ్బులతో నిండి ఉండడం చూసి తెగ సంబరపడిపోయింది. ఆ తర్వాత బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన నాగార్జున, ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here