Ranveer Singh: రణవీర్ సింగ్ సినిమా పక్కన పెట్టేసిన శంకర్.. కారణం ఇదేనా..

0
27
రణవీర్ సింగ్ సినిమా పక్కన పెట్టేసిన శంకర్.. కారణం ఇదేనా..

బాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది రణవీర్ హీరోగా నటించిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో అతని సరసన అలియా భట్ కనిపించింది. ఇక రణవీర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ సింగం ఎగైన్’. ఈ సినిమాలో రణవీర్ తో కలిసి, అజయ్‌ దేవగన్‌, రోహిత్‌ శెట్టిల సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు వాయిదా పడింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ఖాతాలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. మొదటిది- డాన్ 3, రెండవది- శక్తిమాన్. ఈ ఏడాది ఆయన సినిమా ఒకటి మాత్రమే విడుదల కానుంది. దీని తర్వాత తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభించనున్నారు.

తాజాగా ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రణవీర్ సింగ్ ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. సినిమాలో కొంత భాగాన్ని కూడా చిత్రీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రణవీర్ సింగ్ సినిమాని మధ్యలోనే వదిలేయడంతో సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.

రణవీర్ సింగ్, సౌత్ ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కలిసి ‘అపరిచిత్’  సినిమా చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ ‘అపరిచిత్’ హిందీ రీమేక్ కోసం ప్లాన్ చేస్తున్నానని, అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసిన తర్వాత అనేక ఇతర ప్రాజెక్టులు కూడా వచ్చాయని చెప్పాడు శంకర్. ‘అపరిచిత్’ కంటే పెద్ద సినిమా కోసం నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నారని, ఇంతకంటే పెద్ద సినిమా తీయాలనుకుంటున్నారని అంటున్నారు. ఈ  కారణంగానే ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ రెండు విడుద‌ల త‌ర్వాత సినిమా చేయాలా లేదా అనే విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటున్నాము అన్నారు శంకర్. ప్రస్తుతం శంకర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిది- కమల్ హాసన్ ఇండియన్ 2 , రెండవది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. త్వరలో కమల్ హాసన్ సినిమా భారీగా విడుదల కానుంది. ఐతే రెండో సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here