Ranbir Kapoor: ఆ ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేశాను.. నాపై మోసగాడు అనే ముద్ర వేశారు.. రణబీర్ కపూర్..

0
22
జీవితంలో సగభాగం చీటర్ అనే ట్యాగ్‏తో బతికాను.. యానిమల్ హీరో..

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హ్యండ్సమ్ హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసినా సినీరంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీతో ఇటు దక్షిణాదిలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. బీటౌన్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నాడు. అలియా, రణబీర్ దంపతులకు పాప రాహా జన్మించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే తమ పాప ముఖాన్ని రివీల్ చేసింది ఈ జంట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వైవాహిక బంధంలో రణబీర్ సంతోషంగా ఉన్నప్పటికీ తన జీవితంలో సగభాగం మొత్తం చీటర్ అనే ట్యాగ్ తోనే జీవించానని.. ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేస్తే మోసగాడు అనే ట్యాగ్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ తన లైఫ్, లవ్, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న ఇద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేశాను. కానీ ఆ తర్వాత వారిద్దరి మాజీ ప్రియుడు అని పిలిచారు. అలాగే నన్ను కాసినోవా అని మోసగాడు ఏవేవో పేర్లతో పిలిచారు. నేను చాలా సంవత్సరాలు చీటర్ అనే ట్యాగ్ తో జీవించాను. ఇప్పటికీ ఆ రెండు ట్యాగ్ లతోనే నన్ను కొందరు పిలుస్తుంటారు. నేనెప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడలేదు. ఇక నా కూతురు రాహా విషయానికి వస్తే.. తనంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే నా హృదయం తీసి నా చేతులలో పెట్టినట్లు అనిపిస్తుంది. మా నాన్న (దివంగత హీరో రిషీ కపూర్)కు కోపం ఎక్కువ. కానీ ఏది చెప్పినా తల దించుకుని సరే అనేవాడిని.. ఎప్పుడూ ఆయనకు నో చెప్పలేదు. చాలా మంచివాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. రణబీర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ దీపికా పదుకొణే, కత్రీనా కైఫ్ ఇద్దరితో కొన్నేళ్లపాటు ప్రేమాయణం నడిపాడు. అయితే వీరి ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. రణబీర్, దీపిక లవ్, బ్రేకప్ గురించి ఇప్పటికీ అనేక వార్తలు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంటాయి. రణబీర్ కపూర్ చివరిసారిగా యానిమల్ సినిమాలో నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే యానిమల్ పార్క్ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా.. రాముడిగా రణబీర్ నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here