Sunday, December 29, 2024
Google search engine
HomeUncategorizedRambha: వారి పై కక్ష సాధించే వరకు వదిలిపెట్టను.. అమ్మబాబోయ్.. రంభలో ఈ యాంగిల్ కూడా...

Rambha: వారి పై కక్ష సాధించే వరకు వదిలిపెట్టను.. అమ్మబాబోయ్.. రంభలో ఈ యాంగిల్ కూడా ఉందా.!

తన అందంతో, నటనతో విపరీతమైన ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మల్లో రంభ ఒకరు. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రంభ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రంభ. తన గ్లామర్ తో అప్పటి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేశారు రంభ. చాలా మంది స్టార్ హీరోలు రంభ డేట్స్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. రంభ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది రంభ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ.

ఇది కూడా చదవండి : Aman Preet Singh: రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.. ఆమె మన టాలీవుడ్ క్రీజీ హీరోయినే..

ఎన్టీఆర్ తో రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తారక్ నటించిన నాగ, యమదొంగ సినిమాల్లో స్టెప్పులేసింది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా రంభ అందం మాత్రం తరగడం లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే గతంలో రంభ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ.. రచ్చ రచ్చ అంటున్న ఫాన్స్

ఈ ఇంటర్వ్యూలో తన బలహీనత ఏంటో చెప్పింది. తనను ఎవరైనా తిడితే తట్టుకోలేదట ఈ అమ్మడు. వారి పై కక్ష తీర్చుకునే వరకు వదిలిపెట్టను అని తెలిపింది. రంభ మాట్లాడుతూ.. తన తండ్రి విషయంలోనూ ఇలానే జరిగిందని తెలిపింది రంభ.. ఒకసారి తన తండ్రి ఎదో కోపంలో తనను తిడితే ఆరు నెలలు ముప్పుతిప్పలు పెట్టాను అని తెలిపింది. ఆయనతో మాట్లాడలేదు అని తెలిపింది. ఒకేసారి తన తండ్రి తనను ఎందుకో తిడితే.. ఉదయం నుంచి రాత్రి వరకు వెళ్లి మెట్ల కింద దాక్కున్నాను  చెప్పింది. ఆతర్వాత ఆయన వచ్చి బ్రతిమిలాడితే బయటకు వచ్చి అన్నం తిన్నాను అని తెలిపింది. నా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్తా.. అదే నా తప్పులేకుండా నన్ను ఎవరైనా ఏదైనా అంటే వారి పై కక్ష సాధించే వరకు వదిలిపెట్టను అని తెలిపింది రంభ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments