Ram Charan: సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! 500పైగా డ్యాన్సర్స్‌కు చెర్రీ బంపర్ ఆఫర్.

0
17
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.

ఎవరూ అవునన్న కాదన్నా.. ఇండస్ట్రీలోని చాలా మంది కార్మిక కుటుంబాలను అండగా ఉంటున్నారు మెగాస్టార్ చిరు. ఇక ఆయన బాటలోనే పయనిస్తున్న ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కూడా.. తన భార్యతో కలిసి డ్యాన్సర్స్ యూనియన్‌లోని అందరికీ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారందరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇక ఇదే విషయాన్ని స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ ట్వీట్ ద్వారా బయట పెట్టారు. దాంతో పాటే సరైన సమయంలో సాయం చేసిన రామ్‌ చరణ్ ను దేవుడు! అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.

“సరైన సమయంలో సహాయం చేస్తే దేవుడు అంటారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. కానీ అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతోపాటు చరణ్ అన్న, ఉపాసన కొణిదెల వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యూనియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500లకు పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. – జాని మాస్టర్ ” అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here