Wednesday, November 6, 2024
Google search engine
HomeUncategorizedRajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అసలు ఒక్క ప్లాఫ్ కూడా లేని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళినే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. తన టేకింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళిపై ఇప్పుడు ఓ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఒక్క మనిషి.. ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో రూపొందిన ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్‌ ఫ్లిక్స్ సంస్థ పోస్ట్ చేసింది. అలాగే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్ ను కూడా పంచుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ డాక్యుమెంటరీలో రాజమౌళి ప్రపంచ సినిమా పై ఏ విధంగా తన ముద్ర వేశారో చూపించనున్నారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్, జో రుసో, కరణ్ జోహార్ లాంటి సినిమా దిగ్గజాలు వివిధ సందర్భాల్లో రాజమౌళి గురించి పంచుకున్న అభిప్రాయాలను ఇందులో చూపించనున్నారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, రణ్ బీర్ కపూర్ తదితరులు జక్కన్న గురించి పంచుకున్న పలు ఆసక్తికర విషయాలను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీని అనుపమ చోప్రా సమర్పిస్తోంది.

ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments