Raj Tarun-Lavanya: కొత్త మలుపు తిరిగిన రాజ్ తరుణ్-లావణ్యల వివాదం.. మరో కేసు పెట్టిన హీరోయిన్ మాల్వి

0
19
రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు..మరో కేసు పెట్టిన హీరోయిన్

టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్‌ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతుల వివాదం మరో మలుపు తిరిగింది. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్‌ లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్‌నగర్‌ PSలో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. కాగా హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే మాల్వి, ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్య పై కూడా కేసు పెట్టాడు. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట నిజమేనని అంగీకరించిన యంగ్ హీరో, కానీ ఇప్పుడామె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందన్నాడు. అంతేకాదు లావణ్యకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశాడు.

 తమ్ముడికి మెసేజులు పంపుతోంది..

మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందంటూ తిరగబడరా సామీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదంది మాల్వి. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య ఇలాగే వేధిస్తోందని.. అలాగే తనకు కూడా మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ ఆరోపించింది. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని.. ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొంది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వి కోరింది. ఇదే విషయమై ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తిరగబడరా సామీ హీరోయిన్. . తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

ఇవి కూడా చదవండి

తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్ తో హీరోయిన్ మాల్వి మల్హోత్రా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here