Raj Tarun: న్యాయవాదితో వివరణ పంపిన రాజ్‌తరుణ్‌.. మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం..

0
41
రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య.. ఓ ప్రేమకథా చిత్రమ్..

గత పదిరోజులుగా సోషల్ మీడియాలో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్లే తనను దూరం పెడుతున్నాడని.. తనకు అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది. కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు పంపించారు. జూలై 18 వరకు విచారణకు హాజరుకావాలనగా.. తాజాగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు వివరణ పంపించారు. గురువారం పోలీసులు ఎదుట హాజరుకావాలని నోటీసులు పంపించగా.. తాను అందుబాటులో లేనని..విచారణకు హాజారు కాలేనని తెలిపారు. కాగా రాజ్ తరుణ్ ను వ్యక్తిగతంగా విచారణ చేయాలనుకుంటున్న పోలీసులు.. మరోసారి ఆయనకు నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here