Raj Tarun: లావణ్య ఆరోపణలపై స్పందించిన హీరో రాజ్ తరుణ్.. అందుకే ఆమెను దూరం పెట్టానంటూ..

0
43
అందుకే ఆమెను దూరం పెట్టా.. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్

తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.
లావణ్యతో రిలేషన్‌లో ఉన్నమాట వాస్తవమేనని అయితే కొన్ని కారణాలతో దూరం పెట్టినట్లు రాజ్ తరుణ్ తెలిపాడు. ‘ నాపై లావణ్య చేస్తోన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఆమెతో రిలేషన్ షిప్‌లో ఉన్న మాట వాస్తవమే, కానీ ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిపోయింది. అలాగే వేరే వారితో అఫైర్ పెట్టుకుంది. అందుకే ఆమెను దూరం పెట్టాను. లావణ్యకు కేవలం డబ్బులు మాత్రమే కావాలి. అందుకే ఈ కొత్త డ్రామా ఆడుతోంది. ఆమె నన్ను బాగా టార్చర్ పెట్టింది. కన్న తండ్రిని కూడా మోసం చేసింది. ఆమె నన్ను బాగా ఇబ్బంది పెడుతుండడంతో నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. ఒకసారి పెళ్లి చేసుకున్నాను అంటుంది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశానని చెబుతోంది. లావణ్యతో నాకెలాంటి శారీరక సంబంధం లేదు. ఈ విషయం పోలీసులకు చెబితే నా రిప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోననే భయపడి చెప్పలేదు. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే.. నాకీలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా? మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది. ఆమె డబ్బుల కోసమే ఇదంతా చేస్తోంది. ఆమె పేరెంట్స్ తో కూడా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 2017 నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాను’ అని రాజ్ తరుణ్ మీడియాతో చెప్పుకొచ్చాడు.

సినిమా వరకే మా రిలేషన్..

కాగా సహ న‌టి మాల్వి మల్హోత్రాపై లావ‌ణ్య చేస్తోన్న ఆరోపణలను ఖండించాడు రాజ్ తరుణ్. మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను క‌లిసి తిర‌గ‌బ‌డ‌రా సామీ అనే సినిమాలో న‌టించాం. ఆ సినిమా వ‌ర‌కే మా రిలేష‌న్. లావ‌ణ్య కావాల‌ని మా ఇద్దరిపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడీ యంగ్ హీరో.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య నా ర్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు ఆమె అందులో తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని లావణ్య వాపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here