Raj Tarun: రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. పోలీసులకు మరోసారి లావణ్య ఫిర్యాదు..

0
20
రాజ్‌తరుణ్‏తో పదేళ్ల క్రితమే పెళ్లి.. అబార్షన్ చేయించాడు.. లావణ్య

సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్వహరంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టికతన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేశారు. తాజాగా మరోసారి లావణ్య పై కేసు నమోదైంది. లావణ్య తన సోదరుడికి మెసేజ్ చేసి పంపిస్తోందని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. రాజ్ తరుణ్, మాల్వీపై లావణ్య రెండోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులకు లావణ్య మరికొన్ని ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లావణ్య ఫిర్యాదును పరిశీలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. రాజ్‌తరుణ్‌తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, తాము పదేళ్లుగా కాపురం చేస్తున్నామని.. కొన్నాళ్లక్రితం రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని అంటోంది లావణ్య. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని.. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లామని అంటుంది లావణ్య. కానీ మాల్వీ వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైకి వెళ్లాడని.. అతడిని నిలదీయడంతో తనను దూరంపెట్టాడని అంటోంది లావణ్య.

రాజ్‌తరుణ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. పోటాపోటీ ఫిర్యాదులు వస్తున్నాయి. అటు లావణ్య, ఇటు మాల్వీ మల్హోత్రా పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here