కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా, హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించారు. తాజాగా లారెన్స్ చేసిన మరో మంచి పని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఓ ఉపాధ్యాయుడిని ఇంటికెళ్లి మరీ కలిశారు లారెన్స్. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్ ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్దుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతడి బహుమతి తన మనసుకు హత్తుకుందని ఆనందం వ్యక్తం చేశారు రాఘవ లారెన్స్. ఉపాధ్యాయుడి ఇంటికెళ్లి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం లారెన్స్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మరోసారి లారెన్స్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
Hi friends and fans, He’s Selvam, a drawing teacher from Manalurpet Kallakurichi district. I saw his wonderful drawing skills shared on social media by all of you. I wanted to meet him in person and appreciate his talent. Today, I’m happy to meet him and so touched by his gift!… pic.twitter.com/Zai28jVALZ
— Raghava Lawrence (@offl_Lawrence) July 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.