Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedRAAYAN Trailer : దుమ్మురేపిన ధనుష్.. అదిరిపోయిన రాయన్ట్రైలర్

RAAYAN Trailer : దుమ్మురేపిన ధనుష్.. అదిరిపోయిన రాయన్ట్రైలర్

విలక్షణ  ధనుష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ధనుష్ తన 50వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాయన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం . ట్రైలర్‌లో ధనుష్ రెచ్చిపోయాడు. ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకుంటాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘రాయన్ ‘ సినిమాలో ధనుష్ పూర్తి మాస్ అవతార్‌లో ఉంటాడని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు

50వ సినిమా కాబట్టి ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి ‘రాయన్ ‘లో నటించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ‘రాయాన్’ ట్రైలర్‌లో ప్రధాన పాత్రల గ్లింప్స్ చూపించారు. ‘రాయాన్‌’ సినిమాలో ఓ బాలుడి కథ క్రూరంగా మారుతుందని తెలుస్తోంది. ఆ అబ్బాయిలో ఆ మార్పుకి కారణం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘రాయన్’ జూలై 26న విడుదల కానుంది. సినిమా క్వాలిటీ ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి : పార్టీకి పిలిస్తే వెళ్ళాను.. తీరా చూస్తే ఒక్కరికి కూడా బట్టలు లేవు..! హీరోయిన్ షాకింగ్ పోస్ట్

‘సన్ పిక్చర్స్’ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం, ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమాతో విజయం సాధించేలా కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ పై అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. రాయన్  ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments