Producer SKN: మాట నిలబెట్టుకున్న బేబీ మూవీ నిర్మాత.. పిఠాపురంలో మహిళకు ఆటో బహుమతి.. వీడియో వైరల్..

0
17
మాట నిలబెట్టుకున్న బేబీ మూవీ నిర్మాత..

బేబీ మూవీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ (SKN) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త తొక్కి సంపాదించిన డబ్బులతో ఊరందరికీ పార్టీ ఇస్తానని మరియమ్మ అనే మహిళ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్లో మరియమ్మ మాటలు అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరియమ్మ వీడియో చూసిన ఎస్కేఎన్ పవన్ మరో అభిమానిగా మరియమ్మకు మాట ఇచ్చారు. పవన్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి మరో అభిమానిగా ఆటో ఇస్తానని అప్పట్లోనే రీ ట్వీట్ చేశారు బేబీ మూవీ నిర్మాత. సోషల్ మీడియాలో చెప్పిన విధంగానే జనసైనికులు సమక్షంలో మరియమ్మకి ఆటో బహుకరించారు ఎస్కేఎన్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జగ్గయ్య చెరువుకు చెందిన మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వగా.. కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య సినీ నిర్మాత చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆటోను ప్రారంభించింది మరియమ్మ. అలాగే మరియమ్మతోపాటు ఆటోలో ప్రయాణం చేశారు సినీ నిర్మాత ఎస్.కే. ఎన్. ఎవరు పేరు పెట్టని విధంగా పవన్ కళ్యాణ్ పాలన ఉంది అన్నారు ఎస్.కే. ఎన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here