Saturday, December 28, 2024
Google search engine
HomeUncategorizedPriyanka Chopra: ప్రియాంక చోప్రా అందంగా లేదు.. నటన బాలేదన్నారు.. డైరెక్టర్ కామెంట్స్..

Priyanka Chopra: ప్రియాంక చోప్రా అందంగా లేదు.. నటన బాలేదన్నారు.. డైరెక్టర్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. మన దేశంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చేతినిండా సినిమాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకుంటుంది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్‏గా రికార్డ్ సృష్టించిన ప్రియాంక.. కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంది. సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఆమెను దారుణంగా అవమానించారట.. కొన్ని సందర్భాల్లో ఆఫర్స్ ఇస్తామని చెప్పి చివరి నిమిషాల్లో ఆమెను తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందరిలాగే ప్రియాంక కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని సీనియర్ డైరెక్టర్ గుడ్డు ధనోవా తెలిపారు. ఎంతో మంది ఎన్ని మాటలు అన్నా.. నటిగా తనని తాను నిరూపించుకోవాలని ఆరోజే ప్రియాంక నిర్ణయించుకుందని అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుడ్డు ధనోవా మాట్లాడుతూ.. “యాక్టింగ్ పై ఎలాంటి అవగాహన లేకుండానే ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం ఆమెకు నేర్చుకోవాలనే తపన మాత్రమే ఉండేది. ఆమెతో బిగ్ బ్రదర్ సినిమా తీశాను. ఆ సమయంలో తను నా వద్దకు వచ్చి సర్ దయచేసి ఈ సీన్స్ ఎలా చేయాలో చెప్పండి అంటూ అడిగి తెలుసుకునేంది. తన పాత్రకు ఎలాగైన న్యాయం చేయాలని శ్రమించేది. దాదాపు 20 రోజుల షూటింగ్ తర్వాత ఆమె అందంగా లేదు.. నటన కూడా బాలేదంటూ ముంబయి నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. అప్పటివరకు షూట్ చేసిన రషెస్ చూడాలని అక్కడున్నవారు సూచించారు. దీంతో సన్నీ దేవోల్, నేనూ రషెస్ చూసి.. ఆమెతోనే సినిమా చేయాలనుకున్నాం. స్క్రీన్ పై ఆమె కనిపించిన విధానం మాకు నచ్చింది.. ఆమె కెరీర్ లో మంచి స్థాయికి వెళ్తుందని అప్పుడే అనుకున్నాము ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ గుడ్డు ధనోవా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రియాంక ముందుగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్ దళపతి నటించిన తమిళన్ సినిమాతోనే నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ కథానాయికగా ఎదిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments