Praneeth Hanumanth: ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు’.. ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌పై సోదరుడి రియాక్షన్.. వీడియో

0
18
ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌పై సోదరుడి రియాక్షన్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో చంటి బిడ్డలపై అసభ్యకర వీడియోలు చేసి అభాసుపాలైన ప్రముఖ యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (జులై 10) బెంగళూరులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రణీత్ హనుమంతు, డల్లాస్ నాగేశ్వర రావు మరో ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో తండ్రీ కూతుళ్ల అనుబంధంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్‌ చేసిన ట్వీట్‌తో ఈ చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. అతను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో ప్రణీత్ హనుమంతు పేరు బాగా మార్మోగిపోయింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంచు మనోజ్, మంచు లక్ష్మి, కార్తికేయ, సుధీర్ బాబు, మంచు విష్ణుతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

తాజాగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం, అతని అరెస్ట్‌పై సోదరుడు అజయ్ హనుమంతు(అయే జుడే) స్పందించారు. ‘తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. ‘ నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా. కానీ ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. కానీ తప్పడం లేదు.. నాకు పెళ్లై ఇప్పటికే ఆరు సంవత్సరాలు పూర్తయ్యింది. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ప్రేమ వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి నుంచి నేను బయటకు వచ్చేశాను. అప్పటి పరిస్థితులు వేరు. నేను లైఫ్‌లో చాలాసార్లు ఫెయిలయ్యాను. జీవనోపాధి లేక కష్టాలు పడ్డాను. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ కుమారుడినైనా రోడ్‌ మీద నుంచే నా జీవితాన్ని ప్రారంభించాను. అడల్డ్ కామెడీని పర్సనల్‌గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే’ అని అన్నారు అజయ్ హనుమంతు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here