Prabhas – Spirit: ప్రభాస్‌కు విలన్‌గా సౌత్ కొరియా మాన్టర్‌.. సందీప్ వంగా ప్లాన్ అదిరింది.

0
18
ప్రభాస్‌కు విలన్‌గా సౌత్ కొరియా మాన్టర్‌.. సందీప్ ప్లాన్ అదిరింది

ప్రభాస్‌ ది మోస్ట్ అవేటెడ్‌ మూవీ కల్కి రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాక్సీఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తోంది. పాన్ ఇండియా కాదు.. ఓవర్సీస్లో.. అందులోనూ నార్త్‌ అమెరికాలో.. కుప్పలు తెప్పులుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. దీంతో రెబల్ స్టార్‌తో సినిమాలు ప్లాన్ చేస్తున్న.. మన అప్‌కమింగ్ డైరెక్టర్స్‌.. ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. రెబల్‌ స్టార్‌ను యాక్ట్ చేసేందుకు హాలీవుడ్‌ సెలబ్రిటీలను ఎంపికచేసుకుంటున్నారు. ఇక తాజాగా సందీప్ రెడ్డి ఈ పనిని మొదలెట్టారు. తను ప్రభాస్తో తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమాలో… హాలీవుడ్ యాక్టర్ లీ డాంగ్‌ సిక్‌ని తీసుకున్నారట.

ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాని… సందీప్ పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్పిరిట్‌ మూవీలో హాలీవుడ్ విలన్‌ను తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. సౌత్‌ కొరియాకు చెందిన లీ డాండ్‌ సిక్‌ని విలన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ట్రైన్‌ టూ బూసాన్‌, మార్వెల్‌ సిరీస్‌ ఎటర్నల్‌ సినిమాల ద్వారా ఈ సౌత్‌ కొరియన్‌ యాక్టర్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కథ అంతర్జాతీయ నేపథ్యంలో ఉంటుందని. అందుకే హాలీవుడ్‌ నటులపై దృష్టిసారించారని టాక్‌.

ఇక ఈ చిత్రాన్ని సందీప్‌ ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని టి.సిరీస్‌, భద్రకాళి ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మించనున్నారు. ప్రభాస్‌ ఇందులో పవన్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారని ఇప్పటికే సందీప్‌ ప్రకటించారు. అయితే ఇందులో డార్లింగ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here