బాహుబలి సినిమాతో డబుల్ అయిన ప్రభాస్ క్రేజ్.. కల్కి సినిమాతో నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. దేశవిదేశాల్లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన రెండు సినిమాలు ఇచ్చాడు ప్రభాస్. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసిన తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా కల్కి సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది కనిపించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన, రాజేంద్రప్రసాద్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ఇలా చాలా మంది కనిపించారు. ఇక ఈ సినిమా చాలా పార్ట్‌లుగా రానుంది. కల్కి పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే 60శాతం పూర్తయ్యిందని మేకర్స్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు
ఇక ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కల్కి 2తో పాటు సలార్ 2, ది రాజా సాబ్, స్పిరిట్ సినిమాలను లైనప్ చేశాడు. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించారు. ఇక ఇప్పుడు మరో సినిమాలోనూ ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే
ఈసారి ప్రభాస్ తన ఫ్రెండ్ గోపీచంద్ కోసం రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. గోపీచంద్ ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అటు గోపీచంద్ కు, శ్రీను వైట్లకు చాలా కీలకం. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు విశ్వం అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొన్నామధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇక విశ్వం సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే కొందమంది ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ ఎంట్రీకి ప్రభాస్ వాయిస్ ఇస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.