Prabhas: ప్రభాస్ దగ్గరున్న డోల్స్ & గబ్బానా సన్ గ్లాసెస్ ధర ఎంతో తెలుసా..?

0
18
ప్రభాస్ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధరెంతో తెలుసా..

ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో సెన్సెషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన డార్లింగ్ ఇప్పుడు థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో అభిమానులను నిరాశ పరిచినా డార్లింగ్.. ఇప్పుడు కల్కి మూవీతో డబుల్ ట్రీట్ ఇచ్చాడు. కల్కి 2898 ఏడి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ మరింత పెరిగింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి.. హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. త్వరలోనే ఈ మూవీ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు నెటిజన్స్.

ఇదిలా ఉంటే.. కల్కి సినిమాలో పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో కలిసి స్టెప్పులేశాడు డార్లింగ్. ఈ పాటలో ప్రభాస్ లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. పంజాబీ స్టైల్లో కనిపించి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేశాడు. అయితే ఈ పాటతోపాటు.. కల్కి ప్రమోషన్లలో ప్రభాస్ డోల్స్ & గబ్బానా సన్ గ్లాసెస్ ధరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సన్ గ్లాసెస్ ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ట్రై చేస్తున్నారు. సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డికోడ్ ప్రకారం ప్రభాస్ ధరించిన ఆ సన్ గ్లాసెస్ ధర రూ.35.314.

ఇదిలా ఉంటే.. విడుదలైన 8 రోజుల్లో కల్కి చిత్రం రూ. 750 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఈ ఏడాది విడుదలైన ప్రాంతీయ, హిందీ చిత్రాలను అధిగమించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ మూవీ మరిన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా సాగుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here