Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedPrabhas: ఆ నమ్మకంతోనే ఉన్నాం.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది.. శ్యామలదేవి కామెంట్స్..

Prabhas: ఆ నమ్మకంతోనే ఉన్నాం.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది.. శ్యామలదేవి కామెంట్స్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ మ్యారెజ్ గురించి అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా.. లేదా ఏ మూవీ ప్రమోషన్స్ జరిగినా డార్లింగ్ పెళ్లి గురించి ఖచ్చితంగా ఓ ప్రశ్న ఉంటుంది. ఇక ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే మేము మ్యారెజ్ చేసుకుంటామని ఇప్పటికే చాలా మంది హీరోలు ఫన్నీగా కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక డార్లింగ్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ కు చెందిన ఫలానా హీరోయిన్‏తో డార్లింగ్ ఏడడుగులు వేయనున్నారంటూ నెట్టింట రూమర్స్ వినిపించాయి. ఇక పలువురు జ్యోతిష్యులు కూడా ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇక ప్రభాస్ కెరీర్ లో హిట్టు పడదని… పెళ్లి కాదని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. చేతినిండా సినిమాలతో అస్సలు తీరకలేకుండా గడిపేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డార్లింగ్ పెళ్లి గురించి చెప్పుకొచ్చారు.

శ్యామలా దేవి మాట్లాడుతూ.. “మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ప్రభాస్ సక్సెస్ తో రుజువైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి. ప్రభాస్ పెళ్లి విషయంలోనూ అంతే జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ కు పెళ్లి చేయాలని మాకు ఉంటుంది. కానీ సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్ కూడా జరుగుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ పెళ్లి గురించి శ్యామలాదేవి మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు డార్లింగ్ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. అలాగే ఏ మూవీ ఈవెంట్స్ అయినా.. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ మ్యారెజ్ గురించి ప్రశ్న రావడం.. శ్యామలాదేవి స్పందించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments